తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై సీఎం రేవంత్ స్పష్టత

cm-revanth-redd

తెలుగు విశ్వవిద్యాలయానికి (Telugu University) పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) పేరును తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి (Suravaram Prathap Reddy) పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) తెలుగు వర్సిటీ పేరు మార్పు బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించినంత మాత్రాన ఆయన చేసిన త్యాగాలను తక్కువ చేయాలనుకోవడం కాదని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అనేక విశ్వవిద్యాలయాల పేర్లు మారాయని గుర్తుచేశారు. ప్రొఫెసర్ జయశంకర్ (Prof. Jayashankar), కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Lakshman Bapuji), పీవీ నరసింహారావు (PV Narasimha Rao) వంటి మహానుభావుల పేర్లు వర్సిటీలకు పెట్టామని వివరించారు. అదే దారిలో తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టడం జరుగుతుందని చెప్పారు.

పెరు మార్పు నిర్ణయం ఎవరికీ వ్యతిరేకంగా తీసుకున్నది కాదని, కేవలం తెలంగాణ ఉద్యమంలో విశేషంగా పోరాడిన సురవరం ప్రతాప్ రెడ్డిని గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More

One thought on “తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై సీఎం రేవంత్ స్పష్టత

Comments are closed.