ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కేటీఆర్ అసంతృప్తి – ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదంపై BRS Working President కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనలో సహాయక చర్యలు సాగుతున్న తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. “ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా?” అని నిలదీశారు. సహాయక చర్యలు పూర్తి కాకముందే, బాధితులు ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదని ప్రభుత్వం చేతులెత్తేసిన తీరు బాధాకరమని విమర్శించారు.
టన్నెల్ ప్రమాదంపై సీఎం నిర్లక్ష్యం – కేటీఆర్ ఆరోపణలు
KTR సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “ఎనిమిది మంది నిర్భాగ్యులు చిక్కుకుపోయిన విపత్కర పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రికే స్పందించే ఆసక్తి లేకుంటే, అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?” అంటూ విమర్శించారు.
ఓటర్ల కోసం జిల్లాల వెంట పర్యటించే ముఖ్యమంత్రికి, క్షతగాత్రుల ఆర్తనాదాలతో మారుమోగుతున్న SLBC Tunnel ప్రాంతానికి వెళ్లే సమయం లేదా? ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? ప్రజాపాలన అంటే కేవలం ఓట్ల వేట, నోట్ల వేట మాత్రమేనా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
“ఒకవైపు సహాయక చర్యలు ఇంకా ముందుకు సాగకముందే, చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ప్రభుత్వం చేతులెత్తేసిన తీరు బాధాకరం. మరోవైపు, బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి, ఎన్నికల ప్రచారమే తమ మొదటి ఎజెండాగా భావిస్తున్న ముఖ్యమంత్రి! ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా?” అంటూ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.

One thought on “సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు”
Comments are closed.