28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి నిరాకరణ

తెలంగాణ హైకోర్టు ఇటీవల ఓ బాలికకు సంబంధించిన అవాంఛిత గర్భస్రావానికి అనుమతి ఇవ్వడాన్ని నిరాకరించింది. గర్భం ఇప్పటికే 28 వారాలు దాటిందని, ఈ దశలో అబార్షన్ చేయడం తల్లి ప్రాణాలకు ప్రమాదకరమని వైద్య నిపుణుల బోర్డు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన బాలిక తల్లి, అబార్షన్‌కు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ నాగేశ్ భీమపాక, వెంటనే వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వైద్య బోర్డు నివేదిక ప్రకారం, బాలిక గర్భం 28 వారాలు దాటినదని, కడుపులో కవలలు ఉన్నారని వెల్లడించారు. గర్భస్రావం తల్లి ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని నివేదికలో పేర్కొనడంతో, న్యాయస్థానం అబార్షన్‌కు అనుమతి ఇవ్వలేదు.

ఈ కేసు నేపథ్యంలో న్యాయమూర్తి నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బాలిక ప్రసవం అయ్యే వరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయకుండా, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. అలాగే, మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన సఖి సెంటర్ ద్వారా అవసరమైన మద్దతును కూడా అందించాలన్నారు.

Read More : బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి

One thought on “28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి నిరాకరణ

Comments are closed.