బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ ఒకేసారి రెండు భిన్నమైన అభిప్రాయాలు చెప్పడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
“బీజేపీ అసెంబ్లీలో ‘సై’ అని, కేంద్రంలో ‘నై’ అని ఎందుకు అంటోందో సమాధానం చెప్పాలి” అని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఆయన స్పష్టం చేశారు.
ముస్లిం రిజర్వేషన్లపై ఆరోపణలు
ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.
Read More : విమానంలో గుండెపోటుతో గల్ఫ్ కార్మికుడు మృతి

One thought on “బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి”
Comments are closed.