విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీపురుపల్లి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఒక కారు ఢీకొట్టడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More : వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై కేసు నమోదు

One thought on “విజయనగరంలో రోడ్డు ప్రమాదం: బస్సు బోల్తా”
Comments are closed.