ఉధంపూర్‌లో ఆర్మీ వాహనం ప్రమాదం

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఒక వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జవాన్ల మృతిపై ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

Read More : ప్రధానమంత్రి మోదీ స్పష్టంచేశారు.

One thought on “ఉధంపూర్‌లో ఆర్మీ వాహనం ప్రమాదం

Comments are closed.