ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు నియామకం

తెలంగాణలో పార్టీని బలపర్చే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు టీపీసీసీ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించిన పార్టీ, తాజాగా 10 ఉమ్మడి జిల్లాలకు కూడా కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.

ఈ నియామకాల అనంతరం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ జూమ్ వేదికగా కొత్తగా నియమితులైన నేతలతో సమావేశమయ్యారు. పార్టీలో విధివిధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై వారికి వివరించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు మీనాక్షి స్పష్టం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలు వెంటనే క్షేత్రస్థాయిలో విధుల్లో చేరాలని ఆమె సూచించారు.

ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్‌లు:

  • ఖమ్మం: వంశీచంద్ర రెడ్డి
  • నల్గొండ: సంపత్ కుమార్
  • వరంగల్: అడ్లూరి లక్ష్మణ్
  • మెదక్: పొన్నం ప్రభాకర్
  • హైదరాబాద్: జగ్గారెడ్డి
  • మహబూబ్‌నగర్: కుసుమ కుమార్
  • ఆదిలాబాద్: అనిల్ యాదవ్
  • కరీంనగర్: అద్దంకి దయాకర్
  • నిజామాబాద్: అజ్మతుల్లా హుస్సేన్
  • రంగారెడ్డి: శివసేన రెడ్డి

Read More : కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం: ENC అనిల్‌కు నోటీసులు

One thought on “ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు నియామకం

Comments are closed.