CEC కి 200 పేజీల నివేదిక సమర్పించిన BRS నేతలు: HCU

హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) అటవీ భూములలో చెట్ల నరికి, అక్రమ కట్టడాలపై 200 పేజీల పూర్తి నివేదికను సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC)కి అందజేశారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, దేవి ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూసేకరణ, చెట్ల నరికి, పర్యావరణానికి కలిగే ముప్పు వంటి అంశాలపై స్పష్టమైన ఆధారాలతో కూడిన నివేదికను సీఈసీకి సమర్పించారు. అనంతరం ఈ రోజే మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

ఈ అంశంపై ప్రభుత్వ స్ధాయిలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో బీఆర్ఎస్ ముందుకు వచ్చినట్టు సమాచారం.

Read More : పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెన్సేషనల్ కామెంట్స్..

One thought on “CEC కి 200 పేజీల నివేదిక సమర్పించిన BRS నేతలు: HCU

Comments are closed.