ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ ప్రైవేట్ జూలో శనివారం ఉదయం జరిగిన ఘటన కలకలం రేపింది. సింహానికి మాంసాహారం ఇవ్వడం జరిగే సమయంలో జంతు సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న 50 ఏళ్ల మహిళపై ఆ సింహం అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో ఆమెకు చేతికి తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలికి అత్యవసర వైద్యం అందించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.
జూ యాజమాన్యం ప్రకారం, మాంసాహారం పంపిణీ జరుగుతుండగా అజాగ్రత్త కారణంగా సింహం కాటు వేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read More : ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం..

One thought on “సింహం దాడికి 50 ఏళ్ల మహిళ గాయాలు”
Comments are closed.