తెలంగాణ కేబినెట్ విస్తరణకు వేళ చేరింది

revanth-reddy

తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో ఎవరి పేర్లు ఉంటాయన్నదానిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించింది.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ రావాల్సి ఉన్నా అధిష్ఠానం సూచనలతో అక్కడే ఉండిపోయారు. రేవంత్ రెడ్డి ఈ రోజు పార్టీ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కలిసి మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గత రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గంపై కూడ చర్చించారు. సామాజిక సమీకరణం, జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాల ప్రకారం కొన్ని పేర్లు ఎంపిక చేసినట్టు సమాచారం.

ఇక ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా చేసిన వినతులను కూడ రేవంత్ ఈ సందర్భంగా వేణుగోపాల్‌కు వివరించారు. ఈ చర్చల అనంతరం ప్రాథమికంగా పేర్లు ఖరారయ్యాయని తెలుస్తోంది. అయితే, ఖర్గే, రాహుల్ గాంధీ ఆమోదం వచ్చిన తర్వాతే అధికారికంగా మంత్రివర్గ విస్తరణ పేర్లు ప్రకటించనున్నారని సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు పదవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో, ఈ విస్తరణలో ఆ జిల్లాలకు అవకాశం దక్కే అవకాశముందని భావిస్తున్నారు.

Read More : “నన్ను వేశ్యలా చూశారు” అంటూ ఆవేదన

One thought on “తెలంగాణ కేబినెట్ విస్తరణకు వేళ చేరింది

Comments are closed.