అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) గత 9 నెలలుగా స్థిరపడిపోయిన భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ శుక్రవారం భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆమె స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన క్రూ డ్రాగన్ యానిలో 17 గంటల ప్రయాణం చేయనున్నారు.
ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, త్వరలోనే భారత్‌లో కలుసుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
గత 9 నెలలుగా ISSలో ఉన్న సునీతా విలియమ్స్ సాంకేతిక సమస్యల కారణంగా అనుకోకుండా అక్కడే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ప్రస్తుతం సునీతా భూమి వైపు ప్రయాణిస్తూ క్షేమంగా మళ్లీ కుటుంబ సభ్యులను కలుసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

2 thoughts on “అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా నిలిచిపోయిన సునీతా విలియమ్స్ భూమి పయనం”
Comments are closed.