UPI పిన్ మార్పు ప్రక్రియలో మార్పులు: డెబిట్ కార్డ్ లేకుండా పిన్ సెటప్ ఎలా చేయాలో తెలుసుకోండి

upi

డిజిటల్ లావాదేవీల్లో వినియోగదారులు అధిక సంఖ్యలో UPI (Unified Payments Interface) సేవలను ఉపయోగిస్తున్నారు. ఇది వేగంగా మరియు సులభంగా డబ్బు లావాదేవీలను పూర్తి చేసే పద్ధతిగా ప్రాచుర్యం పొందింది. అయితే, యూపీఐ సేవలను సురక్షితంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యం.

నిపుణుల సూచన మేరకు, యూపీఐ పిన్‌ను కాలానుగుణంగా మార్చడం వల్ల భద్రత మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఒకే పిన్‌ను చాలా కాలం పాటు ఉపయోగిస్తే అది మోసాలకు ఆస్కారాన్ని కల్పించే ప్రమాదం ఉంది.

గతంలో UPI పిన్‌ను మార్చాలంటే డెబిట్ కార్డ్ అవసరమయ్యేది. అయితే తాజాగా ఈ నిబంధనలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ పిన్‌ను సులభంగా మార్చుకునే వీలుంది.

UPI పిన్ మార్చే విధానం:

  1. ముందుగా మీ మొబైల్‌లో UPI యాప్‌ను తెరవాలి.
  2. లాగిన్ అయిన తర్వాత మీ బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి.
  3. యూపీఐ పిన్ మార్చాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి.
  4. అందులోని UPI పిన్ సెట్ చేసే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.

ఈ ప్రక్రియలో మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ నంబర్ లింక్ చేసి ఉండాలి. ఇలా పూర్తి చేసిన తర్వాత వినియోగదారులు తమ యూపీఐ పిన్‌ను సులభంగా మార్చుకోవచ్చు.

సురక్షిత లావాదేవీల కోసం వినియోగదారులు తమ పిన్‌ను తరచూ మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

One thought on “UPI పిన్ మార్పు ప్రక్రియలో మార్పులు: డెబిట్ కార్డ్ లేకుండా పిన్ సెటప్ ఎలా చేయాలో తెలుసుకోండి

Comments are closed.