అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం మళ్లీ చెలరేగింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన ‘ఎప్స్టీన్ ఫైల్స్’ పై స్పందించలేదంటూ మస్క్ నేరుగా ట్రంప్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారం అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “ఎప్స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేయని నాయకుడిని ప్రజలు ఎలా నమ్మగలరు?” అంటూ మస్క్ మంగళవారం ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. తన కొత్త రాజకీయ ప్రస్థానం ‘అమెరికా పార్టీ’ అధికారంలోకి వస్తే, ఎప్స్టీన్ వ్యవహారాన్ని పూర్తిగా బయటపెడతామని మస్క్ స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా న్యాయశాఖ కీలక ప్రకటన చేస్తూ, ఎప్స్టీన్ నివాసాలు, ప్రైవేట్ ద్వీపంలో సోదాలు చేసినప్పటికీ ‘క్లయింట్ లిస్ట్’ దొరకలేదని తెలిపింది. ఇకపై ఈ కేసుపై మరే సమాచారం ఇవ్వబోమని పేర్కొంది. ఈ ప్రకటనపై మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌ను దీనిపై ప్రశ్నించగా, ఆయన ప్రశ్నను తప్పించేశారు. “ఇంకా ఎప్స్టీన్ గురించే మాట్లాడుతున్నారా?” అంటూ విలేకరిని ఎదురుగా ప్రశ్నించారు.
గతంలో ట్రంప్, అప్పటి అటార్నీ జనరల్ పామ్ బోండీ ఎప్స్టీన్ కేసును బయటపెడతామని హామీ ఇచ్చారు. “క్లయింట్ లిస్ట్ నా డెస్క్‌పై ఉంది” అని బోండీ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం న్యాయశాఖ విడుదల చేసిన ప్రకటనతో మస్క్‌తో పాటు పలువురు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
Read More : టెక్సాస్‌లో వరద విషాదం: 109 మృతి, 160 గల్లంతు

One thought on “ఎప్స్టీన్ ఫైల్స్ వివాదంలో ట్రంప్‌ను నిలదీసిన ఎలాన్ మస్క్”
Comments are closed.