నాగార్జునసాగర్ జలాశయంలో వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రభావం కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులో 1,53,672 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
వరద ప్రభావంతో అధికారులు శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను ఎత్తారు. దీంతో వరద నీరు సాగర్ జలాశయం వైపు భారీగా విడుదల అవుతోంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం 881 అడుగులకు చేరగా, నీటి నిల్వలు 196.56 టీఎంసీలుగా నమోదయ్యాయి.
వర్షాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సాగర్‌కు మరింత వరద నీరు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read More : ఎయిర్ ఇండియా 171 ప్రమాదంపై : ప్రాథమిక నివేదిక సమర్పణ

2 thoughts on “శ్రీశైలం గేట్లు ఎత్తడంతో సాగర్‌కు భారీ వరద ప్రవాహం”
Comments are closed.