గుజరాత్‌లో గంభీర బ్రిడ్జి కూలి ప్రమాదం

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వడోదరా సమీపంలోని గంభీర బ్రిడ్జి ఆకస్మికంగా కూలిపోయింది. ఈ ఘటనలో రెండు లారీలతో పాటు మరో రెండు వాహనాలు నదిలో పడిపోయాయి. ప్రమాద ఘటనపై స్పందించిన అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలైనట్లు సమాచారం. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వంతెనపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు, వాహనాలను ఇతర మార్గాలుగా మళ్లిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.

Read More : Jyoti Malhotra : యూట్యూబర్ అరెస్ట్‌తో కేరళలో రాజకీయ కలకలం

One thought on “గుజరాత్‌లో గంభీర బ్రిడ్జి కూలి ప్రమాదం

Comments are closed.