Mumbai : అటల్ సేతుపై నుంచి దూకిన డాక్టర్

ముంబైలో ఓ యువ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అయిన అటల్ సేతు పై నుంచి దూకి బలవన్మరణానికి ప్రయత్నించిన ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

నవీ ముంబై పోలీసుల కథనం ప్రకారం, డాక్టర్ ఓంకార్ కవితాకే (32) నవీ ముంబైలోని కలంబోలి ప్రాంతానికి చెందినవారు. గత ఆరు సంవత్సరాలుగా జేజే ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. సోమవారం రాత్రి, తల్లికి ఫోన్ చేసి “డిన్నర్‌కు ఇంటికి వస్తున్నా” అని చెప్పిన కొద్దిసేపటికే, అటల్ సేతుపై నుంచి దూకారు. ఒక వాహనదారుడు ఈ దృశ్యాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వంతెనపై ఆగి ఉన్న ఓ కారును గుర్తించారు. ఆ కారులో డాక్టర్ ఓంకార్‌కి చెందిన మొబైల్ ఫోన్ లభించడంతో అతని ఆత్మహత్యాయత్నం స్పష్టమైంది. ప్రస్తుతం ఆయన కోసం కోస్ట్ గార్డ్‌, అగ్నిమాపక సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. అయితే డాక్టర్ ఓంకార్ ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More : శ్రీశైలం గేట్లు ఎత్తడంతో సాగర్‌కు భారీ వరద ప్రవాహం

One thought on “Mumbai : అటల్ సేతుపై నుంచి దూకిన డాక్టర్

Comments are closed.