విజయవాడ రైల్వే స్టేషన్‌లో చిన్నారి అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట కిడ్నాప్ కేసుగా భావించిన ఈ ఘటనలో, తండ్రే తన మూడేళ్ల కూతురిని కేవలం రూ. 5 వేలకు అమ్మివేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గంటల వ్యవధిలోనే రైల్వే పోలీసులు ఈ కేసును ఛేదించి, చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
ఘటన వివరాలు:
విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి శ్రావణి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో, తండ్రిని విచారించగా అసలు నిజం బయటపడింది. భిక్షాటన కోసం చిన్నారిని రాజమండ్రికి తరలిస్తున్నారని తెలుసుకున్న రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారిని కొనుగోలు చేసిన వ్యక్తులను రాజమండ్రికి వెళ్తుండగా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, చిన్నారిని ఆమె తల్లికి అప్పగించారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్న కూతురిని డబ్బు కోసం అమ్మివేసిన కసాయి తండ్రిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read More : పులివెందుల, ఒంటిమిట్లలో వైసీపీ కుట్రలు – బీటెక్ రవి

One thought on “రూ. 5 వేలకు కన్న కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి”
Comments are closed.