శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై కోటా వినూత దంపతులు తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసు విచారణలో పోలీసులకు ఇచ్చిన సమాచారంలో వారు సంచలన విషయాలను వెల్లడించారు.
వినూత వ్యక్తిగత వీడియోలు డ్రైవర్ శ్రీనివాస్ వద్ద ఉండటం వల్లే హత్య జరిగిందని విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. తమ బెడ్‌రూంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రహస్య కెమెరాలు అమర్పించి వీడియోలు రికార్డ్ చేయించారని, వాటిని డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు సుధీర్‌కు విక్రయించాడని ఆరోపించారు.
ఈ వీడియోల ఆధారంగా ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని తెలిపారు. విషయం బయటపడిన వెంటనే శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి తొలగించామని చెప్పారు. అప్పుడే తాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సంప్రదించామని, అయితే ఆయన బాధ్యతగా స్పందించలేదని విమర్శించారు.
“పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఉంటే శ్రీనివాస్ హత్య జరిగేదే కాదు,” అని చెన్నై పోలీసుల విచారణలో కోటా వినూత దంపతులు స్పష్టం చేసినట్టు సమాచారం.
Read More : రప్పా.. రప్పా వ్యాఖ్యలపై మరోసారి వైఎస్ జగన్
