పులివెందుల, ఒంటిమిట్టలో కూటమి విజయం ఖాయం: పల్లా శ్రీనివాసరావు

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, రెండు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి గెలుపుపై ఎలాంటి సందేహం అవసరం లేదని, ప్రజలు వైసీపీ అరాచకాలకు ముగింపు పలకబోతున్నారని అన్నారు.

ఎన్నికలు పారదర్శకంగా జరుగుతుంటే, తమ ఎత్తులు పనిచేయకపోవడంతో వైసీపీ అసహనంగా వ్యవహరిస్తోందని పల్లా ఆరోపించారు. ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు వైసీపీ పసలేని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి గగ్గోలు పెట్టి ఓటర్ల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించారని ఎద్దేవా చేశారు.

ఓటర్లు ఈ కుయుక్తులను గుర్తించి, వైసీపీకి గట్టి బుద్ధి చెబుతారని పల్లా తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట రెండు స్థానాలు కూటమి ఖాతాలో చేరడం ఖాయమని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారని చెప్పారు. కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రజల సంపూర్ణ సహకారం లభిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

Read More : స్వల్ప ఉద్రిక్తతలతో ప్రశాంతంగా కొనసాగింపు

One thought on “పులివెందుల, ఒంటిమిట్టలో కూటమి విజయం ఖాయం: పల్లా శ్రీనివాసరావు

Comments are closed.