కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగ అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’కు ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలను ప్రోత్సహించడం లక్ష్యంగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏటా రూ. 24,000 కోట్లు వెచ్చించనున్నారు. 2025-26 నుంచి ప్రారంభమయ్యే ఈ యోజన మొత్తం ఆరు సంవత్సరాలపాటు కొనసాగనుండగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని, ఉత్పాదకత మెరుగవుతుందని అధికారులు పేర్కొన్నారు.
Read More : కర్ణాటక గుహలో నివసించిన రష్యన్ మహిళ

One thought on “పీఎం ధన్ ధాన్య యోజనకు కేంద్ర ఆమోదం”
Comments are closed.