సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించారు.
ఈ ఘటనకు సంబంధించి, లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు క్యూలైన్లలో ఉన్న సమయంలో గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మరో నలుగురు భక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తరువాత చోటుచేసుకుంది. సింహాచలంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, మరియు ఈ విషాదం పై మరింత సమాచారం వెలుగులోకి రానుంది.
Read More : కేదార్‌నాథ్ ఆలయం ముస్తాబవుతోంది: 8 క్వింటాళ్ల పూలతో శోభించిన ఆలయం

2 thoughts on “PM దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటించారు”
Comments are closed.