సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయం 9.45 గంటల సమయంలో రివర్వ్యాలీ షాప్‌హౌస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహించగా, మంటలు ఒక్కసారిగా రెండు, మూడు అంతస్థుల్లో వ్యాపించాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.
ఈ ప్రమాదంలో 15 నుంచి 19 మంది గాయపడ్డారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. పొగ శ్వాసనాళంలోకి చొచ్చుకెళ్లిన కారణంగా, స్కూల్ సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ట్వీట్‌లో, “సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. అందులో అన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి బాధగా ఉంది. బాబు త్వరగా కోలుకోవాలని, ఈ క్లిష్ట సమయంలో పవన్ కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పవన్ కల్యాణ్, ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన పూర్తి చేసిన తర్వాత తక్షణమే సింగపూర్ వెళ్లనున్నారని సమాచారం.
Read More : పవన్ కల్యాణ్ ఆదేశం: విశాఖలో జె.ఈ.ఈ పరీక్షకు ఆలస్యంపై సమగ్ర విచారణ జరపండి..

One thought on “సింగపూర్ అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలు – మంత్రి లోకేశ్ స్పందన”
Comments are closed.