ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ‘నార్త్ స్టాండ్’పై ఏర్పడిన వివాదంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్టాండ్‌కు క్రికెట్ లెజెండ్ అజహరుద్దీన్ పేరును తొలగించొద్దంటూ హెచ్‌సీఏకు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఇచ్చిన ఆదేశాల మేరకు అజహరుద్దీన్ పేరును తొలగించాల్సిందిగా సూచించారు. ఇదిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అజహరుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ఆయన, రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలందించానని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు హెచ్‌సీఏ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో అజహరుద్దీన్‌కు తాత్కాలిక ఊరట లభించినట్టైంది.
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్న ఈ వివాదంపై పూర్తి స్పష్టత త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read More : విరాట్ కోహ్లి ఆధ్యాత్మిక మార్పుకు కారణం అనుష్క శర్మ : సోనాల్ చౌహాన్

One thought on “ఉప్పల్ స్టేడియంలో ‘నార్త్ స్టాండ్’ పేరును మార్చొద్దు..”
Comments are closed.