వైఎస్సార్‌సీపీ నేత పోసాని కృష్ణ మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సీఐడీ కేసులో గుంటూరు జైలులో రిమాండ్‌లో ఉన్న పోసానిని విచారణ నిమిత్తం ఒక్కరోజు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
మంగళవారం ఉదయం 10 గంటలకు పోసానిని గుంటూరు జిల్లా జైలు నుంచి సీఐడీ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయనను వివిధ కోణాల్లో పోలీసులు విచారించారు.
విచారణ సమయంలో పోసాని వివరణను పోలీసులు పలు కీలక అంశాలపై నమోదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పోసాని కేసుపై మరిన్ని కీలక విషయాలు వెలుగు చూడవచ్చని అంచనా వేస్తున్నారు.

One thought on “పోసాని సీఐడీ కస్టడీ”
Comments are closed.