శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది.

విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమై, అత్యవసర ల్యాండింగ్‌కు సిద్ధమయ్యారు. ఆయన చాకచక్యంతో విమానాన్ని తిరిగి సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు. విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ సకాలంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు ధృవీకరించారు.

Read More : కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

One thought on “శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం

Comments are closed.