కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన విషాద ఘటన మరువకముందే, హైదరాబాద్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. బండ్లగూడ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మరణించారు.

ఘటన వివరాలు
కొందరు యువకులు ట్రాక్టర్‌పై భారీ వినాయక విగ్రహాన్ని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద విగ్రహం హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకింది. దీంతో టోని (21), వికాస్ (20) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు అఖిల్ తీవ్రంగా గాయపడగా, అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు.

Read More : పాతబస్తీలో కాలువలో పడ్డ కారు

One thought on “కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

Comments are closed.