సీనియర్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సత్యరాజ్ ఈ వయసులోనూ తన ఎనర్జీతో మళ్లీ ఆకట్టుకుంటున్నారు. ‘బాహుబలి’లో కట్టప్పగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, తాజాగా ‘త్రిబాణధారి బార్బారిక్’ అనే వినూత్న టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తుండగా, ముఖ్యంగా ‘అనగా అనగా కథలా’ అనే పాట తాతా-మనవరాల మధ్య అనుబంధాన్ని ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేస్తూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైంది. ఈ పాటను ప్రమోట్ చేయడంలో సత్యరాజ్ స్వయంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పాల్గొంటూ, ఇన్ఫ్లుయెన్సర్స్తో కలిసి డ్యాన్స్ చేస్తూ నెట్జన్స్ను ఆకర్షిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడే విధంగా ఆయన చేస్తున్న రీల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సత్యరాజ్‌తో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్. సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. ఈ వయసులోనూ ప్రొమోషన్స్లో ఎనర్జీగా పాల్గొంటున్న సత్యరాజ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

One thought on “కట్టప్ప మళ్లీ బ్లాక్‌బస్టర్ మూడ్‌లో..! సత్యరాజ్ ఎనర్జీకి ఫిదా అవ్వాల్సిందే!”
Comments are closed.