సమంత – నందినీ రెడ్డి మళ్లీ కలిసి పని చేయబోతున్నారా?

సమంత - నందినీ రెడ్డి మళ్లీ కలిసి పని చేయబోతున్నారా?

స్టార్ హీరోయిన్ సమంత మరియు టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి మరోసారి ఓ సినిమాకి కలిసి పనిచేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఓ బేబీ ఘన విజయాన్ని సాధించగా, ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సమంత, నందినీ రెడ్డి గతంలో జబర్దస్త్’, ‘ఓ బేబీ సినిమాలు చేశారు. ‘జబర్దస్త్’ అంతగా ఆడకపోయినా, ‘ఓ బేబీ’ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా నిర్మిస్తోంది. అదే సమయంలో నందినీ రెడ్డితో కూడా ఓ కొత్త సినిమా చేయబోతోందని సమాచారం.

ఈ కొత్త ప్రాజెక్ట్ సమంత సొంత బ్యానర్‌లో ఉంటుందా? లేక వేరే నిర్మాణ సంస్థలో తెరకెక్కుతుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వీరిద్దరి అనుబంధం ఎంతో గట్టిగా కొనసాగుతుండగా, గతంలో ‘సామ్ జామ్’ అనే టాక్ షోకు నందినీ రెడ్డి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబో మేజిక్ చేయనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read More

One thought on “సమంత – నందినీ రెడ్డి మళ్లీ కలిసి పని చేయబోతున్నారా?

Comments are closed.