సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బాంబు బెదిరింపులు – ముంబై పోలీసుల హై అలర్ట్

Salman Khan death threats

కొంత గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మళ్లీ హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా ముంబై ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి తీవ్రమైన బెదిరింపు సందేశం వచ్చింది. ఇందులో సల్మాన్ ఇంట్లోకి చొరబడి హత్య చేస్తామని, అతడి కారును బాంబుతో పేల్చేస్తామని పేర్కొనడం ముంబై పోలీసులను హైఅలెర్ట్ చేసింది. దీంతో సల్మాన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి, బెదిరింపుల వెనుక ఉన్న వారి ఆధారాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.

గతంలోనూ సల్మాన్ ఖాన్ ప్రాణాలకు పలు మార్లు ముప్పు ఏర్పడిన సంగతి తెలిసిందే. 2023లో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అతడి ఇంటిపై కాల్పులు జరిపిన ఘటన తర్వాత అతడి భద్రతను మరింత పెంచారు. అయినప్పటికీ, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు నిరంతరం సల్మాన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. 90లలో జోధ్‌పూర్ అడవుల్లో కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌పై కోర్టు తీర్పు వచ్చినా, బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం వ్యక్తిగత వైరంతో ఇప్పటికీ దాడులకు పాల్పడుతోంది. జైలు నుంచే బెదిరింపులు పంపిస్తున్న బిష్ణోయ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే సికందర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్‌కు తక్కువ రెస్పాన్స్ రావడంతో నిరాశ తప్పలేదు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూలు చేసినప్పటికీ, డొమెస్టిక్ మార్కెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ప్రస్తుతం ప్రాణ హాని ముప్పుతో పాటు సినిమా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం సల్మాన్ ఖాన్‌ను మానసికంగా కాస్త క్షోభకు గురిచేసినట్లుగా సమాచారం.

Read More

One thought on “సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బాంబు బెదిరింపులు – ముంబై పోలీసుల హై అలర్ట్

Comments are closed.