నిన్న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అద్భుత అనుభవాన్ని అందించింది. అభిషేక్ శర్మ పవర్ఫుల్ బ్యాటింగ్‌తో 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్ల కోల్పోయి ఛేదించడంతో స్టేడియం ఉప్పొంగిపోయింది. వరుస ఓటముల తర్వాత వచ్చిన ఈ అద్భుత విజయంతో సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విజయానికి ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో ఏ విధంగా సంబంధం ఉందో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ సన్‌రైజర్స్ జట్టుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, ప్రతి మ్యాచ్‌లో హాజరై ప్రోత్సహిస్తుంటారు. మిగతా స్టార్లు కనిపించకపోయినా, వెంకటేష్ తన జట్టును సొంతంగా భావించి దాన్ని సమర్థిస్తారు. పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతీ జింటాతో ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సన్నివేశాలు ఇప్పటికీ ఫేమస్‌గా నిలిచాయి, మరియు ఇప్పుడు ఆ సన్నివేశాలను సోషల్ మీడియాలో మీమ్స్‌గా విపరీతంగా వాడుతున్నారు.
నిన్నటి మ్యాచ్ ఫలితం తరువాత, నెటిజన్లు ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలోని సన్నివేశాలు గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నారు. సన్‌రైజర్స్ జట్టును అభిమానులు ‘కాటేరమ్మ కొడుకులు’గా పిలుస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.
గతంలో పెద్ది, పుష్ప, రంగస్థలం, ఆర్ఆర్ఆర్, దేవర వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల రెఫరెన్సులు ఐపీఎల్ సందర్భాల్లో వినిపించాయి. కానీ, నిన్నటి మ్యాచ్‌లో విక్టరీ వెంకటేష్ హాజరుకాలేదు. ఆయన స్టేడియంలో ఉంటే, తన మాజీ హీరోయిన్ ప్రీతీ జింటాతో సరదాగా ముచ్చటించే అవకాశం ఉండేది. మరొక మ్యాచ్‌లో వీరిద్దరూ కలుసుకుంటారేమో చూడాలి.
#Venkatesh and #PreityZinta ni malli chudam in groundpic.twitter.com/GTe6902map#SRHvsPBKS #PBKSvsSRH
— TeluguBigg (@TeluguBigg) April 12, 2025

One thought on “ప్రేమంటే ఇదేరా : సన్ రైజర్స్ విజయంలో వెంకీ-ప్రీతి జోడీ మీమ్స్‌లో!”
Comments are closed.