ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం: అమరావతి రాజధాని, పెట్టుబడులు, తదితర కీలక నిర్ణయాలు

chief-minister-n-chandrababu-naidu-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై క్యాబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది.

సీఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలకు క్యాబినెట్ ఆమోదం ఇవ్వనుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి ఇవ్వనుంది. అలాగే, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఐదో ఎన్ఐపిబీ సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవడం కూడా పరంగా ఉంటుంది.

కొత్తగా రూ.30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాల సృష్టి చేసే ప్రతిపాదనలకు కూడా ఆమోదం ఇవ్వనున్నారు. విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో పాటు ఇతర పలు కంపెనీల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.

ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులు, కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, నెల్లూరులో ఏపీఐఐసీ, విజయనగరంలో గ్రేహౌండ్స్, గుంటూరు జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూముల కేటాయింపులు కూడా ఈ సమావేశంలో చర్చించబడతాయి.

అలాగే, అమరావతి రాజధాని పునఃప్రారంభ పనులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కూడా క్యాబినెట్‌లో చర్చ జరగనుంది.

Read More : భర్త హత్య: 9 నెలల గర్భిణి అనూషను గొంతు నులిమి చంపిన జ్ఞానేశ్వర్

One thought on “ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం: అమరావతి రాజధాని, పెట్టుబడులు, తదితర కీలక నిర్ణయాలు

Comments are closed.