కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాను కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మోదీకి ఆరంభం నుంచి తెలంగాణపై వివక్షత భావం ఉందని విమర్శించారు. రాష్ట్ర రైతాంగానికి యూరియా సరఫరా చేయకుండా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని పేర్కొంటూ, దీనిని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఎండగట్టారని చెప్పారు. తెలంగాణ రైతుల తరఫున గొంతు కలిపిన ఎంపీ ప్రియాంక గాంధీకి సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

తమ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం మోదీ భజనలో మునిగిపోయారని విమర్శించారు. రైతుల కోసం ఒత్తిడి తీసుకురావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పత్తా లేరని ఎద్దేవా చేశారు.

గల్లీల్లో లొల్లి చేసే బీఆర్ఎస్ నేతలు, ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారని రేవంత్ నిలదీశారు. “మోదీ అంటే భయమా… భక్తా?” అని ప్రశ్నించారు.

Read More : గాంధీ ఆసుపత్రిలో ఖైదీ పరార్ – పోలీసులకు షాక్

One thought on “కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

Comments are closed.