కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక పురోగతి

కూకట్‌పల్లి మైనర్ బాలిక సహస్ర హత్యకేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనలో అనుమానితుడిగా సంజయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. సహస్ర నివసిస్తున్న భవనంలోనే అద్దెకు ఉంటున్న సంజయ్, హత్య అనంతరం అనుమానాస్పదంగా తిరిగినట్లు పోలీసులు తెలిపారు. అదే అనుమానంతో అతడిని విచారణకు లోనుచేసినట్లు వెల్లడించారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల సహస్రను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన గత వారం సంచలనం రేపింది. బాలిక గొంతు కోసి, కడుపులో కత్తితో పొడిచి కిరాతకంగా చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. బాలిక శరీరంపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయని, వాటిలో ఎక్కువగా మెడ భాగంలో ఉన్నట్లు వివరించారు.

ప్రాథమిక దర్యాప్తులో, నిందితుడు లైంగికదాడి ప్రయత్నం చేసి ఉండవచ్చని, సహస్ర ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణ కోసం ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేయగా, పరిసర ప్రాంతాల్లో వందల సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. హత్య జరిగిన ఇంటికి సంబంధించిన ఫుటేజ్‌ను కూడా పోలీసులు సేకరించారు.

Read More : సీఎం రేవంత్ రెడ్డి మోదీ సర్కార్‌పై ఫైర్

One thought on “కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక పురోగతి

Comments are closed.