కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ విధానంపై వివిధ రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
డీలిమిటేషన్ పై కీలక చర్చల నిమిత్తం తమిళనాడు డీఎంకే నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈనెల 22న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశానికి హాజరుకావాలని డీఎంకే నేతలు రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్ పై ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి.
డీఎంకే నేతలు కే ఎన్ నెహ్రూ, ఎంపీ ఎన్.ఆర్ ఇలాంగో ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చలు జరిపినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ, రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు డీఎంకే నేతలు ఇప్పటికే డీలిమిటేషన్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ తమ రాష్ట్ర ప్రజల హక్కులను దెబ్బతీసేలా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

One thought on “డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన డీఎంకే నేతలు”
Comments are closed.