ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగం వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ.22 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. జూన్ 16న మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇది మొదటి దశలో 587 మెగావాట్ల సౌర, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లతో ప్రారంభమవుతుంది. మొత్తం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల స్టోరేజ్ సామర్థ్యం లభించనుంది.
దావోస్‌లో జరిగిన చర్చల్లో మంత్రి లోకేశ్, రెన్యూ ఛైర్మన్ మధ్య వ్యూహాత్మక ఒప్పందంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఇప్పటికే రిలయన్స్, టాటా పవర్, ఎన్టీపీసీ, వేదాంత, బ్రూక్‌ఫీల్డ్ వంటి సంస్థలు ఏపీలో భారీగా పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశానికి మార్గనిర్దేశకంగా నిలవనుంది.
Read More : చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణపై పవన్ కల్యాణ్ ఆదేశాలు.

One thought on “ఆంధ్రప్రదేశ్‌లో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు”
Comments are closed.