టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ

టెస్ట్ క్రికెట్‌కు ఇటీవలే వీడ్కోలు పలికిన టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముంబైలోని అధికారిక నివాసం *‘వర్ష’*లో మర్యాదపూర్వకంగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం సీఎం ఫడ్నవీస్ తన అధికారిక ‘ఎక్స్‌’ (పూర్వపు ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ, రోహిత్ శర్మను కలవడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు.

‘‘భారత క్రికెట్ జట్టుకు విశేష సేవలందించిన రోహిత్ శర్మను వర్షలో కలవడం ఆనందంగా ఉంది. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయనకు భవిష్యత్తు ప్రస్థానంలో విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను,’’ అంటూ ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా రోహిత్‌తో కలిసి తీసిన ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.

ఈ భేటీ నేపథ్యంలో రోహిత్ శర్మ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడా? అనే చర్చలు సోషల్ మీడియాలో వేగంగా పుట్టుకొస్తున్నాయి. ఫొటోలు వైరల్ కావడంతో అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అయితే, రోహిత్ రాజకీయాల్లోకి వస్తున్నాడన్న ఊహాగానాలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ రాలేదు.

Read More : ప్రభుత్వ పదవులకు నో చెప్పిన తీర్పు

One thought on “టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ

Comments are closed.