ఇటీవల అరెస్టయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త శశిధర్ గౌడ్ ఇంటికి బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు శశిధర్ గౌడ్ కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. శశిధర్ గౌడ్‌పై నమోదైన కేసులు రాజకీయ ప్రతీకార చర్యల భాగమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఆయనకు పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే న్యాయపరంగా గౌడ్ నిర్దోషిగా బయట పడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More : బీజేపీకి కొత్త రాష్ట్రాధ్యక్షులు
