రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గ్రామంలో దారుణం జరిగింది. పశువుల మేత విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ వ్యక్తి, అతని కుమారుడు దంపతులపై కత్తితో దాడి చేశారు. వాజీద్, అతని భార్యపై వారి ఇంటిలోకి చొరబడిన ఆఫీజ్, అసిఫ్ అనే తండ్రీకొడుకులు ఈ దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో వాజీద్ భుజానికి తీవ్ర గాయమైంది. దంపతులిద్దరూ రక్తపు మడుగులో పడిపోయారు. వాజీద్ తన పశువులను మేత కోసం కట్టివేయడంపై ఈ గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు.
Read More : ధారాలిలో భారత సైన్యం సహాయక చర్యలు

One thought on “మొయినాబాద్‌లో దంపతులపై కత్తితో దాడి”
Comments are closed.