యువకుడితో ఫోన్ మాట్లాడిందని అక్కను హతమార్చిన తమ్ముడు

రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. అక్క యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతుందని కోపోద్రిక్తుడైన తమ్ముడు ఆమెను హత్య చేసిన ఘటన స్థానికులను కలిచివేసింది.

పోలీసుల వివరాల ప్రకారం, రాఘవేందర్, సునీత దంపతుల పెద్ద కూతురు రుచిత(21) డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ అడ్మిషన్‌ కోసం వేచి చూస్తోంది. గత కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమ సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం రెండు కుటుంబాల మధ్య పలు సార్లు గొడవలకు దారితీసింది. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిపి, ఇకపై మాట్లాడుకోమని ఇద్దరికీ హెచ్చరికలు జారీ చేశారు.

అయితే, సోమవారం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో రుచిత తిరిగి ఆ యువకుడితో మాట్లాడడం గమనించిన తమ్ముడు రోహిత్‌(20) ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో వైరుతో రుచిత గొంతును బిగించి హతమార్చాడు. ఈ ఘటనపై రుచిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రోహిత్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

దర్యాప్తులో భాగంగా రోహిత్‌ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు, “బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన రీల్‌ను గుర్తించారు. దీంతో పథకం ప్రకారమే రుచితను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

Read More : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్థానిక అభ్యర్థికే టికెట్ – మంత్రి

One thought on “యువకుడితో ఫోన్ మాట్లాడిందని అక్కను హతమార్చిన తమ్ముడు

Comments are closed.