హైదరాబాద్-విజయవాడ రూట్‌లో RTC ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు!

tgsrtc

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తరచుగా కొత్త నిర్ణయాలను అమలు చేస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్తను ప్రకటించారు.

తెలంగాణ RTC: హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి ప్రత్యేక రాయితీలు..

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ RTC) విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త అందించింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. లహారి (Lahari) – నాన్ AC స్లీపర్ కమ్ సీటర్ (Non-AC Sleeper Cum Seater), సూపర్ లగ్జరీ (Super Luxury) బస్సుల్లో 10 శాతం రాయితీ, రాజధాని AC (Rajadhani AC) బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు టీజీఎస్ RTC వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉండగా, తెలంగాణలో రెండో అతిపెద్దదైన గొల్లగట్టు జాతర సూర్యాపేటలో ఘనంగా జరుగుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు జాతరకు తరలివస్తుండడంతో, వారికోసం RTC ఈ ప్రత్యేక రాయితీని ప్రకటించినట్లు తెలుస్తోంది. అలాగే, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పండుగ జరగనున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో నివసించే వారు తమ సొంతూర్లకు వెళ్లే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని RTC ఈ ఆఫర్‌ను అమలు చేస్తున్నట్లు సమాచారం.

Read More