హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని జానపహాడ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. అవినీతికి పాల్పడిన గ్రామ కార్యదర్శిపై కఠిన చర్యలకు ఆదేశించారు.
అవకతవకల విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే, సదరు కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయాలని, అలాగే ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కేసు నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాలతో తక్షణమే రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ అధికారులతో కేసు నమోదు చేయించారు. ఒకటి, రెండు రోజుల్లో వెంకటయ్య అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకాల్లో అవినీతిని ప్రభుత్వం సహించబోదని ఈ చర్య నిరూపిస్తోంది.
Read More : రామంతపూర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్

2 thoughts on “ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల అవకతవకలు.”
Comments are closed.