బీజేపీలోకి వలసలు: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారు

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. చాలా మంది మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు.

ఫామ్‌హౌస్ కేసుపై కీలక ఆరోపణలు

ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మొత్తం మాజీ సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో జరిగిన స్క్రిప్ట్ అని రాంచందర్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌ను కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read More : గోపాలపురం సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ కేసులో దర్యాప్తు వేగం