జగిత్యాల జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఓ జిల్లా రవాణా అధికారి (డీటీఓ) చిక్కారు. రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా డీటీఓ బానోతు భద్రు నాయక్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
కోరుట్లకు చెందిన జేసీబీ యజమాని శశిధర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేవని శశిధర్‌కు చెందిన జేసీబీని డీటీఓ సీజ్ చేశాడు. దానిని వదిలి పెట్టేందుకు రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశాడు.
చివరకు రూ. 22 వేలు తీసుకునేందుకు అంగీకరించిన డీటీఓ, తన డ్రైవర్ అరవింద్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీటీఓ బానోతు భద్రు నాయక్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.
Read More : గోపాలపురం సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ కేసులో దర్యాప్తు వేగం

One thought on “జగిత్యాల డీటీఓ ఏసీబీకి చిక్కాడు”
Comments are closed.