ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎక్సైజ్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనకు సూచించింది. అయితే ఆరోగ్యం బాగాలేదని కారణంగా చూపుతూ రజత్ భార్గవ ఈరోజు విచారణకు హాజరు కావడం లేదు. దీనిపై ఆయన సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విచారణకు కొంత గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. వచ్చే వారం విచారణకు హాజరవుతానని తెలియజేశారు. ఇదిలా ఉండగా, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో మద్యం కొనుగోలు, పంపిణీ, ధరల నిర్ణయంలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఆయనపై విచారణ జరపాలని నిర్ణయించింది.
ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన సిట్.. కొందరిని అరెస్టు కూడా చేసింది. తాజాగా రజత్ భార్గవకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడం, ఆయన హాజరు కాలేదని ప్రకటించడం ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.
Read more : సీఎం – నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్, కేసు నమోదు

One thought on “ఏపీ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగం”
Comments are closed.