హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలోని కర్తార్ మెమోరియల్ స్కూల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూల్‌కు శుభ్రంగా హెయిర్‌కట్ చేసి, టక్ వేసుకొని రావాలని చెప్పినందుకు స్కూల్ ప్రిన్సిపల్ జజ్జరీ సింగ్‌ను ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు కత్తులతో పొడిచి హత్య చేశారు. విద్యార్థుల చేతిలో ప్రిన్సిపల్ బలైపోవడంతో విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, సమాజం తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. విద్యార్థుల దారుణ చర్యకు వ్యతిరేకంగా సమాజంలోని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read More : పాకిస్థాన్ టీవీ నటి హుమైరా అస్గర్ అకాల మరణం…

One thought on “హర్యానాలో 12వ తరగతి విద్యార్థుల దారుణం”
Comments are closed.