ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. దీంతో మిథున్ రెడ్డి మరో నాలుగు రోజులు జైల్లోనే కొనసాగాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇక, ఇటీవల ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి జైలులో సహాయకుడిని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాలపై రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నా లేదా స్వయంగా పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడే సహాయకులను నియమించవచ్చని, ఈ సందర్భంలో ఎంఎన్వో లేదా ఎఫ్ఎన్వో సిబ్బందిని ఉపయోగిస్తామని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించిన అంశంపై ఇప్పటికే వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ రివ్యూ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అవుతుందా లేదా అన్నది ఈ నెల 29న జరిగే విచారణ అనంతరం తేలనుంది.
Read More : రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీసిన దేశెట్టి శ్రీనివాసులు

2 thoughts on “ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ”
Comments are closed.