వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం అలవాటుగా మారిందని బీజేపీ ఎంపీ డాక్టర్ పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గు పడే స్థాయిలో ఉన్నాయని ఆమె విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు అసహనానికి కారణమవుతాయన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి తక్షణమే తన మాటలను వెనక్కి తీసుకోవాలని, ప్రశాంతి రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎంపీ పురందేశ్వరి డిమాండ్ చేశారు. మహిళల గౌరవం కించపరచబడే విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి.
Read More : శ్రీశైలం గేట్లు ఎత్తడంతో సాగర్‌కు భారీ వరద ప్రవాహం

One thought on “ఎంపీ పురందేశ్వరి ఆగ్రహం”
Comments are closed.