ఏపీ కూటమి ప్రభుత్వంపై మరోసారి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ… ఇది ముందుచూపుతో చేసిన హత్యాయత్నమేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో ఈ దాడి జరిగింది అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… “పోలీసుల కళ్ల ముందే టీడీపీకి చెందిన రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన ప్రసన్నకుమార్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలు చేపట్టారు. ఆయన వయోవృద్ధ తల్లి మీద కూడా భయానకంగా బీభత్సం సృష్టించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి” అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇక తాను ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలను తెలుసుకుంటున్న నేపథ్యంలో… ఆ పర్యటనపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ దాడిని దాడిగా చేసి కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. ‘‘ప్రజా సమస్యలు ఎవరు మాట్లాడరాదు… అందరూ ఈ దాడి గురించే మాట్లాడాలని కూటమి ప్రభుత్వ పథకం. చంద్రబాబు తన ‘రెడ్ బుక్ రాజ్యాంగంతో’ ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు’’ అని తీవ్ర విమర్శలు చేశారు.
ప్రతిపక్ష గొంతును నొక్కాలన్న ప్రయత్నాలు విజయవంతం కావు. హింసతో ప్రజాస్వామ్యం నశించదు… ప్రజలు చూస్తున్నారు అని హెచ్చరించారు.
Read More : ఎంపీ పురందేశ్వరి ఆగ్రహం

One thought on “వైఎస్సార్ పార్టీ అధినేత, మాజీ సీఎం భగ్గుమంటూ…?”
Comments are closed.