పూణెలో మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారం

పూణెలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పార్సిల్ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్‌ యువతిపై లైంగికదాడికి పాల్పడి పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఓ డెలివరీ బాయ్‌ (32) ఆ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతికి పార్సిల్ అందించేందుకు వెళ్లాడు. ఓటీపీ చెప్పమని కోరిన సమయంలో యువతి తన మొబైల్ తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా, అదే సమయంలో డెలివరీ బాయ్‌ అనుమతించకుండా లోపలికి వచ్చి తలుపులు వేసి, ఆమె ముఖానికి పెప్పర్ స్ప్రే చల్లి అపస్మారక స్థితికి గురి చేశాడు. తర్వాత ఆమెపై లైంగికదాడి జరిపిన అతడు, అదే ఫోన్‌ ద్వారా సెల్ఫీ తీసుకుని, “తిరిగి వస్తాను” అంటూ ఒక నోట్‌ రాసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
అప్పటికే స్పృహతప్పిన బాధితురాలు కొంతసేపటి తరువాత హుషారులోకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేశారు.

ఈ దారుణ ఘటనపై స్థానికులు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేసిన ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Read More : మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్

One thought on “పూణెలో మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారం

Comments are closed.