తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు భారీ నష్టం కలిగించిన సినీ పైరసీ ముఠాకు పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. హైదరాబాదులోని వనస్థలిపురం ప్రాంతంలో అక్రమంగా సినిమాలను రికార్డ్ చేసి వాటిని పైరసీ వెబ్‌సైట్లకు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి వనస్థలిపురంలోని ఎన్జీవో కాలనీలో ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అతను తన మొబైల్ ఫోన్‌ని ఉపయోగించి థియేటర్లలో సినిమాలను రికార్డ్ చేస్తాడు మరియు ప్రతి సినిమాను MovieRulez మరియు TamilMV వంటి పైరసీ సైట్‌లకు రూ.40,000 నుండి రూ.80,000 వరకు ధరకు అమ్ముతాడు.
ఇప్పటివరకు మొత్తం 65 సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేవలం ఈ ఒక్క వ్యక్తి కారణంగా 2024 సంవత్సరంలో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, మరిన్ని గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తున్న పైరసీ ముఠాలను కూడా గుర్తించే పనిలో ఉన్నారు.
Read More : పూణెలో మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారం

One thought on “మూవీరూల్జ్‌కు సినిమా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్”
Comments are closed.